calender_icon.png 23 May, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్

22-05-2025 10:04:57 PM

చేగుంట (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్(Congress Mandal Party President Vadla Naveen Kumar) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రి సీతక్కలకు ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. సర్పంచుల పదవీకాలం మూడు సంవత్సరాల ముందు నుండి బిల్స్ రాక చాలా ఇబ్బంది పడ్డారని గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు గౌరవం లేకుండా ఇష్టానుసారంగా ఎప్పుడు చూసినా ఎస్టిఓ ఫ్రీజింగ్, మాత్రమే ఉండేదని చాలా ఇబ్బందిపడ్డ సర్పంచులకు ఈ ప్రభుత్వం ఊరటనిస్తూ నూటయాభై, కోట్ల రూపాయలను విడుదల చేసిందని దాదాపు పదివేల పెండింగ్ బిల్లులను క్లియర్ చేసినట్లు నవీన్ కుమార్ తెలిపారు.

గ్రామ స్వరాజ్యం బలపడే విధంగా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి ఎంతో ఊరటను ఇచ్చారని ఈ సందర్భంగా కొనియాడారు. గత ప్రభుత్వంలో సర్పంచుల పదవీ కాలానికి మూడు సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులకు గురిచేసారని కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలకు కారణమయ్యారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎన్నో సందర్భాల్లో మాజీ సర్పంచులు తమ గోడు ఆవేదన నిత్యం వెల్లబోసుకునే వారని కాంగ్రెస్ ప్రభుత్వం వారి బాధలను అర్థం చేసుకొని నిధులు విడుదల చేసిందని నవీన్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆంజనేయులు గౌడ్ డిసిసి అధ్యక్షులు మెదక్, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.