calender_icon.png 23 May, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేశ్వరంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

22-05-2025 10:46:12 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరంలో హనుమాన్ జయంతి(Hanuman Jayanti) వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ ఉప ప్రధాన అర్చకులు పణీందర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రధాన ఆలయానికి ప్రక్కన కట్టమీద ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక చందనోత్సవం, వడమాలలు అభిషేకం, పూజా, హనుమాన్ చాలీసా, మహా అన్నదానం, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

అనంతరం హనుమాన్ భక్తులకు మాలవిరమణ తర్వాత తీర్థ ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ మహేష్, సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మోహన్ శర్మ, సభ్యులు మంచినీళ్లు దుర్గయ్య, కుంభం పద్మ, మహదేవపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బందెల సత్తెమ్మ, కాలేశ్వరం గ్రామస్తులు, భక్తులు, స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.