22-05-2025 09:59:44 PM
ఖమ్మం (విజయక్రాంతి): మహిళ పోలీస్ స్టేషన్ లో భాధ్యతలు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఇటీవల మరణించిన హెడ్ కానిస్టేబుల్ కె.తిరుమలరావు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జె.క్రిష్ణ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ 7.99 లక్షల భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కును గురువారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Police Commissioner Sunil Dutt) అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. శాఖపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైన పోలీస్ అధికారులు అందుబాటులో వుంటారని అన్నారు. పోలీసు కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటామన్నారు.