22-05-2025 10:11:06 PM
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి..
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని, రైతులకు నష్టం కలగకుండా అధికారులు అండగా నిలవాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదరపు కలెక్టర్ కే.వీరబ్రహ్మచారి, జడ్పీ సీఈవో పురుషోత్తంతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వెఫికేషన్ పారదర్శంకగా వేగంగా పూర్తి చేయాలన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మండల కేంద్రం, గ్రామ స్థాయిలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సిద్ధంగా ఉండన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా జిల్లాలో 41 నూతన గ్రామ పంచాయతీ భవనాలు, సెగ్రిజేషన్ షేడ్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ ల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, హౌజింగ్ పిడి రాజయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, సూపర్డెంట్ దామోదర్ రెడ్డి, ఏంపిడిఓలు, తహసిల్దార్లు, తదితరులు ఉన్నారు.