16-06-2025 11:38:59 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి 8 గంటల నుంచి రైతులకు రైతు భరోసా పథకంలో ఎకరానికి 6000 చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం ప్రారంభించింది. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం నాయకపల్లి గ్రామానికి చెందిన బొలగాని పుషమ్మ తనకు ఒక ఎకరం 39 గుంటల భూమి ఉండగా గుంటకు 150 రూపాయలు చొప్పున 79 గుంటల భూమికి సాగు పెట్టుబడి కింద 11,850 రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ మేరకు రాత్రి 8: 01 గంటలకు ఆమె ఫోనుకు రైతు భరోసా నిధులు జమైనట్టు మెసేజ్ రావడంతో సంతోషం వ్యక్తం చేసింది.