calender_icon.png 5 July, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపదలో ఉన్నవారికి అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

05-07-2025 04:41:52 PM

మందమర్రి (విజయక్రాంతి): ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అండగా గెలుస్తుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్(Congress Party President Nomula Upender Goud) అన్నారు. శనివారం పట్టణ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధిత కుటుంబానికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆయన అందజేసి మాట్లాడారు. పట్టణంలోని 8వ వార్డుకి చెందిన ముదారపు తిరుపతి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబానికి మంజూరైన 60,000 రూ. చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సొత్కు సుదర్శన్, ఎర్ర రాజు, రాచర్ల గణేష్, మాయ తిరుపతి, శేఖర్ లు పాల్గొన్నారు.