04-09-2025 10:19:33 PM
మంటపాల వద్ద అన్నదాన కార్యక్రమం
మహబూబాబాద్ (విజయక్రాంతి): గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) వ్యాప్తంగా గణనాథుడి మండపాల వద్ద ఘనమైన పూజలు నిర్వహించారు. గణేష్ మంటపాల వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరసిద్ధి వినాయక మండపం వద్ద సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నేడు గణేష్ విగ్రహాల నిమజ్జనం
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించిన నిర్వాహక మండల్లు నేడు గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలో నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే మురళి నాయక్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ పరిశీలించారు. ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో పట్టణ సీఐ మహేందర్ రెడ్డి డీజే నిర్వాహకులను తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.