calender_icon.png 5 September, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెళ్లి విరిసిన మతసామరస్యం

04-09-2025 10:06:16 PM

హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఐక్యతతో గణేష్ నవరాత్రి వేడుకలు.. 

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని ఎస్వి టెంపుల్ ఏరియాలో హిందూ ముస్లిం క్రిస్టియన్లు ఐక్యతగా గత 11 సంవత్సరాలుగా కాలనీలో వినాయకుని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తూ మతసామరస్యానికి ప్రత్యేకగా వేడుకలు నిర్వహిస్తున్నారు. కాలనీలోని అన్ని వర్గాల యువకులు కాలని వాసులు ఓం శ్రీ వరసిద్ధి వినాయక మండలి అని నామకరణం చేసి గత దశాబ్ద కాలంగా వినాయకుని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాలనీలోని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలిసి మెలిసి ఐక్యంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించు కోవడం విశేషం. 

మహా అన్న ప్రసాదం..

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం గణేష్ మండపంలో కాలని వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండప నిర్వాహకుల ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదం చేపట్టారు. మహాన ప్రసాదానికి హాజరైన పలువురు భక్తులు, ప్రముఖులు మాట్లాడుతూ మతసామరస్యాలకు ప్రతీకగా హిందూ,ముస్లింలు ఐక్యమత్యం తో వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమని నిర్వాహకులను కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈకార్యక్రమంలో వినాయక మండలి కమిటీ సభ్యులు జాడ క్రాంతి కుమార్,మహ్మద్ ఖాసీం, మేకల సాయికుమార్, రాం ఓవదేశ్, ఎండి నజీమ్, కిందింటి కుమార్, మేకల అరుణ్, దేశమల్ల సిద్దార్థ, భీమా గణేష్, జాడ కీర్తీ కుమార్, బబ్బెర విజయ్, నన్నపురాజు శ్యాంసుందర్, ఐలవేని ఈశ్వర్, కౌట్ల వెంకటేష్, భీమా గణేష్, రాజు శర్మ, శివ శర్మ, మహిళలు, భక్తులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.