calender_icon.png 5 September, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోటా ఖాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు

04-09-2025 10:03:04 PM

ఉప్పల్ (విజయక్రాంతి): ఈ నెల 14 సెప్టెంబర్ 2025 విక్టరీ చోటా ఖాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ పిసిసి అధ్యక్షులు, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్(Telangana Sports Karate Association) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కరాటే రాను రాను అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా మన రాష్ట్ర క్రీడాకారులు ముందంజలో ఉన్నారని నేను రాష్ట్ర అధ్యక్షుడుగా గత పది సంవత్సరాల నుండి కరాటేని గుర్తింపు తెచ్చే విధంగా నేను ప్రయత్నిస్తున్నానని దీనికి అనుకూలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ముందంజలో ఉన్నారని నేటి సమాజంలో ఆత్మరక్షణ చాలా ఉపయోగకరమని ముఖ్యంగా మహిళలకు అవసరం వచ్చే విద్య అని ఈ పోటీలు జాతీయ స్థాయి నుండి అన్ని రాష్ట్రాల నుండి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారని మంచి అఫీషియల్ తో ఈ పోటీలు జరగబోతున్నాయని కరాటే మల్లికార్జున్ గౌడ్ దాదాపుగా 40 సంవత్సరాల పైన ఈ విద్యని జిల్లాల వారీగా రాష్ట్రాలవారీగా వారి అసోసియేషన్ ఏర్పాటు చేయడం అభినందనగా విషయమన్నారు.

అనంతరం కరాటే మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ, గత పది సంవత్సరాలు పైగా మహేష్ కుమార్ గౌడ్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఉపాధ్యక్షులుగా ఉన్నారని కరాటే నీకు వారి అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ గుర్తింపు తెచ్చే విధంగా ముందుకు తీసుకెళుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రేపు జరగబోయే 14 న మన భారతదేశం నుండి 12 రాష్ట్రాల నుండి ఈ పోటీలో పాల్గొంటారని ఈ పోటీలు బొమ్మకు బాలయ్య గార్డెన్స్ లో నిర్వహిస్తున్నామని ఈ పోటీలకు రాజకీయ నాయకులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తోపాటు వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి అఫీషియల్స్ విచ్చేసి ఈ టోర్నమెంట్ ని పెద్ద ఎత్తున జరిపించేందుకు మా స్వయ శక్తుల కృషి చేస్తున్నామని తెలిపారు చైర్మన్ సదాశివుడు మాట్లాడుతూ నారాయణ సంస్థ ద్వారా ఈ పోటీలను క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు మేము స్వయ శక్తులకు తీసే కృషి చేస్తున్నామని వచ్చిన విద్యార్థి విద్యార్థులను మంచి సౌకర్యాలతో ఈ కార్యక్రమాన్ని జరగాలని నేను ముందంజలో ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గౌడ్ , ఎం వెంకటేష్, శ్రీనివాస్, కిరణ్ నాయక్, కొయ్యడ ప్రసాద్ గౌడ్, విగ్నేష్ జితేందర్ కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.