04-09-2025 10:35:47 PM
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ఏరియా నూతన జిఎంగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ రాధాకృష్ణ గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak)ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కెకె ఓసి ఆర్ అండ్ ఆర్, భూసేకరణ సమస్యలపై కలెక్టర్ తో చర్చించారు. అనంతరం జిల్లా అటవీ అధికారి శివ ఆశిష్ సింగ్ కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ లోని ఆర్కే ఓసి ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా అధికారులు పాల్గొన్నారు.