04-09-2025 10:16:11 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ దేవేందర్(Assistant Treasury Officer Devender) పదవి విరమణ గురువారం రోజున సన్మాన మహోత్సవము జరిగింది. ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మన ప్రియమైన సబ్ ట్రెజరీ ఆఫీసర్ దేవేందర్ 39 సంవత్సరాల సేవా ప్రయాణం ముగించుకుని, పదవీ విరమణ రోజునే ఎప్పుడెప్పుడు వస్తుందా అని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూచి ఎదురుచూచి అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్ గా పదోన్నతి హోదా పొంది గౌరవప్రదంగా రిటైర్ అవుతున్నారు. ఇది ఆయన కృషి, నిజాయితీ, అంకితభావానికి ప్రభుత్వం ఇచ్చిన గౌరవ పట్టం అని అన్నారు. జీవితంలో హోదాలు శాశ్వతం కావు,కానీ మనం ఉద్యోగిగా చేసిన సేవలు మంచి పనులు పేరు మాత్రం శాశ్వతంగా చిరస్మరణీయంగా ఉంటాయన్నారు.
దేవేందర్ తన సహోద్యోగులందరినీ మెప్పించి ఆయన ఇంకొంతకాలం మనతో ఉంటే బాగుండు అనిపించేలా అందరి హృదయాలు గెలుచుకున్నారు. ట్రెజరీ ఉద్యోగిగా జన్మించడం అంటే అదృష్టం. ఎందుకంటే జీతాలు ఇచ్చి – జీవితాలను కాపాడే బాధ్యత ఈ శాఖకు లభించింది. అలాంటి గొప్ప శాఖలో పనిచేసి, చివరికి పదోన్నతి పొంది పదవీ విరమణ పొందడం నిజంగా గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవోల జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, బొంకూరు శంకర్, సంగం లక్ష్మణరావు, డాక్టర్ అరవింద్ రెడ్డి, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, సర్దార్ హర్మేందర్ సింగ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోట రామస్వామి శంకర్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కొండయ్య, సందీప్ రెడ్డి,పెన్షన్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెండ్యాల కేశవరెడ్డి, మోసం అంజయ్య,ఇల దాసరి లింగయ్య, రోహిత్,ఆజ్గర్ శ్రీనివాస్,ట్రెజరీ ఉద్యోగులు వివిధ డిపార్ట్మెంట్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెన్షనర్లు అధిక సంఖ్య లో పాల్గొని పదవి విరమణ సన్మాన మహోత్సవాన్ని విజయవంతం చేశారు.