04-09-2025 10:29:28 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం బ్రిడ్జి ప్రక్కన ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి పార్కు నందు గురువారం పర్యావరణాన్ని పరిరక్షించే భాగంలో గ్రీన్ భద్రాద్రి, సెయింట్ పాల్స్ విద్యాసంస్థలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఐటీడీఏ పీవో బి రాహుల్(ITDA PO Rahul) చేతుల మీదగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఓ ఐటీడీఏ రాహుల్ మాట్లాడుతూ, ఈ పార్క్ నిర్వహణకు సంబంధించి మొక్కలను ప్రతి సంవత్సరం పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల చారిటీ ద్వారా కడియం నుండి అందించి గ్రీన్ భద్రాద్రి పరిరక్షణలో ముఖ్యమైన భాగస్వామిగా సేవనందిస్తున్న డాక్టర్ కె అబ్రహంని ప్రత్యేకంగా అభినందిస్తూ, విద్యార్థుల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పిస్తూ సేవ భావాన్ని భావితరాలకు అందించేలా తీర్చిదిద్దిన యాజమాన్యానికి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు శ్రీమతి లలిత ఇతర సభ్యులు డాక్టర్ కే అబ్రహం ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు అభినందనలు తెలిపారు.