1 July, 2026 | 10:52 AM

రోడ్డు నిర్మాణానికి రైతులు సహకరించాలి

13-06-2024 12:22 AM

ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి

నర్సాపూర్, జూన్ 12: నర్సాపూర్ నియోజకవర్గం నుంచి వెళ్తున్న ఆర్‌ఆర్‌ఆర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ మార్గం అభివృద్ధికి రైతులు సహకరించాలని నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలం లోని తిరుమలాపూర్, తుజాల్‌పూర్, మహమ్మదాబాద్, నాగులపల్లి, ఖాజిపేట, ముసా పేట్, పెద్దచింతకుంట గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకాలు తీసుకున్నారు. అలాగే రైతుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ పద్మ, ఎస్సై శ్రీనివాస్, ఆర్‌ఐ సిద్దిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.