1 July, 2026 | 10:00 AM

వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం

13-06-2024 12:24 AM

దుబ్బాక కాంగ్రెస్ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి

చేగుంట, జూన్ 12: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం చేగుంట మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ఆర్‌వీఎం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసినా తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు చౌదరి శ్రీనివాస్, ఆర్‌వీఎం ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.