30-10-2025 12:21:16 AM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
బిచ్కుంద, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ప్రాంగణంలో సోయా కొనుగోలు కేంద్రని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం మద్నూర్ సహ కార సొసైటీ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
సోయా ధాన్యం క్వింటాలు రూ.5,328/-ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు.కావున రైతులందరూ సోయా ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని. దళా రులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల కష్టానికి న్యాయం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ సౌనజన్య రమేష్, దరస్ సాయిలు, హనుమాన్ మందిర్ ఆలయ చైర్మన్ రాంపటేల్, రమేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నూతన పోస్ట్ ఆఫీస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
పెద్దకొడప్గల్, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో బుధవారం నూతన పోస్ట్ ఆఫీస్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోస్ట్‌ఆఫీస్‌ల ద్వారా ఉత్తరాలు, పార్శిళ్లను పంపడం మరియు స్వీకరించడం, డబ్బు బదిలీ సేవలు, పొదుపు ఖాతాలు, బీమా పథకాలు మరియు బిల్లు చెల్లింపులు వంటి అనేక రకాల సేవలను అందిస్తున్నారని తెలిపారు.
పోస్ట్ ఆఫీస్ లు అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీవో అభినవ్ చందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శామప్ప పటేల్, మొగుల గౌడ్, అహ్మద్, శ్రీహరి, రామారావు, నారాయణరావు, మండల మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు