30-10-2025 12:20:31 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
గోపాల్ పేట, అక్టోబర్ 29 : జిల్లాలో వ ర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు డెంగ్యూ పరీక్షలు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆద ర్శ్ సురభి ఆదేశించారు.బుధవారం గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, అటెండెన్స్ వివరాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వై ద్యం అందించాలని ఆదేశించారు. జిల్లాలో వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతున్న నే పథ్యంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు డెంగ్యూ పరీక్షలు కొనసాగించాలని ఆదేశించారు. అ దేవిధంగా మలేరియా, డెంగ్యూ కు సంబంధించిన మందులు అందుబాటులో ఉండే లా చూసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, ప్రోగ్రామ్ ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి, వైద్యాధికారులు పరిమళ ఇతర అధికారులు తదితరులు కలెక్టర్‌వెంటఉన్నారు.