calender_icon.png 31 October, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళపై దాడి కేసులో ఆరుగురికి జైలు శిక్ష

30-10-2025 12:21:24 AM

యాదాద్రి భువనగిరి అక్టోబర్ 29 ( విజయక్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో నర్సాపురం గ్రామంలో 2019 సంవత్సరంలో నమోదైన కేసులో గ్రామానికి చెందిన కావటి మహేష్, కాబట్టి నరేష్, కాబట్టి శివ, ఎనుగుల ఉప్పలయ్య ,జక్కుల రామకృష్ణ మరియు కావటి సుదర్శన్ అనే ఆరుగురు నిందితులు మహిళపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తు అధికారి పి శివ నాగ ప్రసాద్ ఆధారాలను  సేకరించి సాక్షులతో కోర్టులో ఛార్జ్  సీటు సమర్పించారు. శనివారం ఎస్ శిరీష అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు రామన్నపేట వారు నిందితులందరినీ దోషులుగా నిర్ధారించి, ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరం  శిక్షతోపాటు రూపాయలు 500 జరిమానా  విధించారు. ఈ కేసు విచారణలో ఏపిపి వెంకట అవినాష్ సమర్థంగా వాదించారు .కేసు విజయవంతం పూర్తి కావడంతో సహకరించిన సిడిఓ ఏ రామాచారి వలిగొండ పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.