30-10-2025 10:08:59 PM
జిల్లాలో కొనుగోలు కేంద్రాలు విస్తృతంగా ఏర్పాటు చేయాలి*
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మొంధా తుపాన్ ముందు, తర్వాత కురిసిన భారీ వర్షానికి జిల్లాలో పత్తి, వరి, మొక్కజొన్న తదితర రైతాంగం తమ పంటలు తీవ్రంగా నష్ట పోయారని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడం వల్ల ప్రైవేట్ వ్యాపారుల చేతిలో మోసాలకు గురికావాల్సి వస్తుందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం ఏఐయుకేస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్ర వెంకన్న అమర్లపూడి రాము మాట్లాడుతూ జిల్లా లో కురిసిన వర్షాల కారణంగా రైతులకు చేతికి వచ్చిన పంటలు భారీగా దెబ్బతిని రైతులు నష్ట పోయినరన్నారు. వారిని ప్రభుత్వ వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు నష్టపోయిన రైతన్నకి ఎకరాకి రూ 50 వేల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. తడిసిన, మొలకెత్తైన, రంగు మరిన పంటలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర ప్రకారమే కొనుగోలు చెయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయిని రాజు, కల్లూరి కిషోర్, బానోత్ ధర్మ, పండూరి వీరబాబు, కిసరి వెంకటేష్, బైరు వెంకన్న,నకిరికంటి నాగేశ్వరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.