30-10-2025 10:11:22 PM
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ పరిధి ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్ వరద ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. అనంతరం మాట్లాడుతూ వరద ముంపు బాధితులను పరామర్శించి, కొనసాగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా మంత్రి సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రతి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వారికి భరోసా కల్పించారు.