30-10-2025 10:07:05 PM
తెలంగాణ రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు మోర రవి
మణుగూరు (విజయక్రాంతి): మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగ పంటలను, ఇండ్లు కోల్పోయిన సాధారణ ప్రజల ఆస్తి నష్టాన్ని సర్వే చేసి ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మోర రవి డిమాండ్ చేశారు. గురువారం సంఘం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రవి మాట్లాడుతూ, మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా మొంథా తుఫాన్ వలన గాలి, వానతో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, బొప్పాయి, కూరగాయల తోటలు, పండ్ల తోటల రైతులకు పంట నష్టంతో పాటు, సాధారణ ప్రజల ఇండ్లు కూలిపోయి ఆస్తి నష్టం జరిగిందన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి జరిగిన పంట నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని గుర్తించి, తగిన పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రకృతి వైపరీత్యం తో రైతులు ఆరుగాలం కష్టపడి పండించి చేతికొచ్చిన పంటలు నేలమట్టం అయ్యా యని, తుఫాన్ ప్రభావంతో అన్ని రకాల పంటలు తడిసిపోవడం వలన ప్రభుత్వ మే కనీస మద్దతు ధరకు పంటలను కొను గోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్ర మంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుం జ వెంకటేశ్వర్లు, కొమరయ్య, భద్రయ్య, మమత, లక్ష్మయ్య, రాము, ప్రశాంత్, పాల్గొన్నారు.