calender_icon.png 17 October, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు దళారులకు ధాన్యం విక్రయించవద్దు

17-10-2025 05:50:20 PM

మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

హుజురాబాద్,(విజయక్రాంతి)రైతులు దళారులకు ధాన్యాన్ని విక్రయించవద్దని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తడికల్, గద్దపాక, మెట్పల్లి, కొత్తగట్టు  సహకార సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతు శ్రేయస్సు కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రం ద్వారా చివరి గింజ వరకు ధాన్యం కొంటామన్నారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దు అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దాన్యం కొనుగోలు చేయక రైతులను ఇబ్బంది చేస్తే వారిపై శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.