17-10-2025 05:54:33 PM
కరీంనగర్ మెడికవర్ వైద్యులు
జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): ట్రామా కేసుల్లో ప్రతి నిమిషం విలువైనదేనని సెకన్లలో తీసుకునే వేగవంతమైన నిర్ణయం, సరైన వైద్యసహాయం రోగి ప్రాణాన్ని కాపాడగలదని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు అన్నారు. వరల్డ్ ట్రామా డే సందర్భంగా శుక్రవారం జగిత్యాల పట్టణంలోని శివ సాయి హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ట్రామా డే ద్వారా ప్రజల్లో ప్రమాదాలపై అవగాహన పెంపొందించడం, రోడ్డు భద్రత నియమాలను పాటించడం, ప్రమాదం జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా సమయానికి వైద్య సహాయం పొందడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించడమే మా లక్ష్యం అన్నారు. మెడికవర్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన బృందంతో, అన్ని విభాగాల (న్యూరో, ఆర్థో, సర్జరీ) సమన్వయంతో 24/7 వేగవంతమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తీసుకువస్తే వేగంగా రికవరీతోపాటు ప్రాణాలను సులభంగా కాపాడడం సాధ్యపడుతుందని తెలిపారు.