calender_icon.png 24 October, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: ఎంపీడీఓ గోపి

24-10-2025 05:40:48 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మధ్య దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ గోపి అన్నారు. మండల పరిధిలోని కుంచమర్తి, ఉయ్యాలవాడ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ను పొందాలని సూచించారు.