24-10-2025 05:46:25 PM
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవం
రోటరీఅసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పోలియో దినోత్సవo నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవితేజ, గెస్ట్ ఆఫ్ హానర్ గా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, స్పెషల్ గెస్ట్ గా రోటరీ రీజనల్ ఫెసిలిటేటర్ రంజిత్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి పోలియో టీకాలు వేయించాలని ఈ పోలియో వల్ల చిన్నపిల్లలకి ఎన్నో ప్రమాదాలు వాటిల్లుతాయని పేర్కొన్నారు.
అక్టోబర్ 24 వరల్డ్ పోలియో డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో వీఆర్కె కళాశాల విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. ఈ పోలియో వ్యాధి నిర్మూలించడంలో రోటరీ పాత్ర ఎంతో ఉందని 2014లో భారతదేశo పోలియో రహిత దేశంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజలంతా ఈ పోలియో గురించి అవగాహన పెంచుకొని చిన్నపిల్లలని సంరక్షించాలని పేర్కొన్నారు. తదనంతరం విద్యార్థినీ విద్యార్థులకు పోలియోపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. దానిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.