calender_icon.png 16 July, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు

16-07-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో 

మహబూబాబాద్, జూలై 15 (విజయ క్రాంతి): యూరియా కోసం అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత సాగు డిమాండ్ కు తగ్గట్టు మహబూబాబాద్ జిల్లాలో 7,346 మీ టిక్ టన్నుల యూరియా, ఇతర ఎరువులు స్టాక్ ఉన్నాయని జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. జిల్లాలో వానకాలం పంటల సాగు, ఎరువుల విలువలు, పంపిణీ పై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, జిల్లాలో వానకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, యూరియా, ఇతర ఎరువులు నిలువ ఉన్నాయని చెప్పారు. అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కల్తీ ఎరువులు అమ్మితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

సొసైటీల నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రతి రైతుకు ఎరువులను పంపిణీ చేయాలని ఆదేశించారు.. వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చూడాలని, డిమాండ్ కు తగ్గట్టుగా ఎరువులను అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ డీ ఏ వో శ్రీనివాసరావు, ఏడిఏ లు మురళి, విజయ్ చందర్, మండలాల వ్యవసాయ అధికారులు, సొసైటీల సీఈవోలు పాల్గొన్నారు.