calender_icon.png 24 October, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని అమ్మాలి

24-10-2025 12:00:00 AM

  1. మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే 

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు 

కామారెడ్డి, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రైతులు తమకు పండిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు  కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నిజాంసాగర్ మండలం మాగి    గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుచేసి దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించాలన్నారు. దళారులకు ధాన్యాన్ని విక్రయిస్తే రైతులు నష్టపోతారని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలని సూచించారు. అనంతరం మాగి  గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు టైం బెల్టులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పిట్ల మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.  పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని , నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  ప్రారంభించారు.అనంతరం మాగి గ్రామంలో పాఠశాల విద్యార్థులకు టై, బెల్టులు అందజేశారు.