24-10-2025 12:53:48 AM
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రుల దండుపాళ్యం ముఠా రాష్ట్రాన్ని నడిపిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అవి నీతికి ప్రభుత్వ అధికారులు భయపడుతున్నారని, వీరి వాటాల పంచాయితీలో తమ కు భాగస్వామ్యం వద్దు, తమకు సం బంధం లేదంటూ అధికారులు పారిపోతున్నారని విమర్శించారు. వారి వేధింపులతోనే అధికారులు వీఆర్‌ఎస్ తీసుకుంటున్నారని ఆరో పించారు.
తాను చెప్పిన పని చేయలేదని ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్‌ఎస్ తీసు కుంటే కూడా, ఆయన రాజీనామా ఆమో దించవద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారని స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో కేటీ ఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు, అక్రమాలకు గనుక భాగస్వాములు అయితే, అధికారులు వత్తాసు పలి కితే గతంలో మాదిరి జైలుకు వెళ్లవలసి వస్తుందని హెచ్చరించారు.
మంత్రుల అవినీతి వాటాల పంచాయితీలకు అధికారులు దూరం ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిలాంటి బలహీన ముఖ్యమంత్రిని చూడలేదని, ఒక మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులను సీఎం పంపడం, నిందితుని స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని మాయమైపోవడం ఎప్పు డూ చూడలేదన్నారు. స్వయంగా సీఎం అనుచరుడు, ఆప్తుడు రోహిన్‌రెడ్డిపై మంత్రి కుమార్తె ఆరోపణ చేసినప్పుడు నిసిగ్గుగా సీఎం మౌనంగా ఉన్నారని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశంపైన స్పందించాలని సూచించారు. స్వయంగా తనపైన మం త్రి కూమార్తె ఆరోపణలు చేసినా ఏమీచేయలేని బలహీన సీఎం రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. తన పరిపాలన పైన, మంత్రుల పైన ఎలాంటి పట్టు లేదని తేలిపోయిందన్నారు. దావూద్ ఇబ్రహీం లాంటి ముఖ్యమంత్రిని తరిమేసుకుంటేనే తెలంగాణ పట్టిన శని పోతుందని తెలిపారు. రాష్ర్టంలో అవినీతి విలయతాండవం చేస్తున్నదని ఆరోపించారు. గ్రామస్థాయి నుంచి రాష్ర్ట సచివాల యం దాకా రాష్ర్టంలోని అన్ని శాఖల్లో కొనసాగుతున్నదన్నారు. సీఎం వేల కోట్లు సంపాదిస్తుంటే, మేము వందల కోట్లయినా సంపాదించవద్దని మంత్రులు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో మాఫియా రాజ్యం
గన్నులు పెట్టి బెదిరించడంతో ఇందిరమ్మ రాజ్యంలో వ్యాపారవేత్తలు తమ వ్యా పారాలు చేసుకోలేకపోతున్నారని, తెలంగాణలో నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం మని విమర్శించారు. పోలీసులు వెతుకుతున్న నిందితుడిని అరెస్టు చేయొద్దు అంటూ మంత్రి కుమార్తె ఆపితే.. స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని వెళ్ళిపోయినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. ఏం ఉద్దరించారని సీఎంకు శాలువా కప్పి పీసీసీ ప్రెసిడెంట్ సన్మానం చేశారని ప్రశ్నించారు.
ఇద్దరు మంత్రులు కలిసి ఏం పొడిచారని పీసీసీ ప్రెసిడెంట్ స్వీట్లు పంచారని, ఇద్దరి మధ్యలో ఏం సెటిల్మెంట్ జరిగిందని ఈ కలరింగ్ ఇచ్చారని నిలదీశారు. వాటాల పంచాయితీ, అవినీతి సొమ్ముల పంపకాలు, టెండర్ల రిగ్గింగ్ ఇవ న్నీ కూడా కాంగ్రెస్ ఇంటి పంచాయితీ లెక్క మారిపోయాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు సెటిల్మెంట్‌లకు కేంద్రంగా మారిపోయిందని ఆరోపించారు.
పరిశ్రమల యజమానులకు తుపాకీలు పెట్టినప్పుడు, వాటాల పంచాయితీతోనే మంత్రులు బజారుకెక్కినప్పుడు, సీనియర్ అధికారులు పారిపోతుంటే రాష్ర్టంలోని పోలీసు యం త్రాంగం ఏం చేస్తున్నదని నిలదీశారు. తుపా కీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, తెచ్చింది రోహిన్ రెడ్డి అని స్వయంగా మంత్రి కుమార్తె చెపుతుంటే, కానీ పోలీసులు మాత్రం గన్ ఇచ్చిం ది కొండా మురళి, బెదిరించింది కొండా సురేఖ, సుమంత్ అని చెప్తున్నారని మండిపడ్డారు.
కానీ ఇప్పటివరకు పోలీసులు ఎలాం టి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ర్ట డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. డీజీపీకి నిజాయితీ ఉంటే గనుల బెదిరింపు వ్యవహారంలో చర్యలు తీసుకుని తన చిత్తశుద్ధి నిరూ పించుకోవాలని, పోలీస్ యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉంటే, గన్ను తెచ్చింది ఎవరు, గన్ను గురిపెట్టింది ఎవరు అనే విషయాన్ని తేల్చాలని హితవు పలికారు.
ఈ అంశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారణ చేసి ఆయన అభిప్రాయాన్ని రికార్డు చేయాలని, సుమంత్‌ను విచారించి నిజానిజాలు బయటపెట్టా లని కోరారు. సీఎం సోదరుడు 15 ఎకరాలు, కొండా సురేఖ 15 ఎకరాలు తీసుకొని మొ త్తం 30 ఎకరాల భూమి పంచాయితీ పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ భూమి కోసం రేవంత్‌రెడ్డి, కొండా సురేఖ కొట్లాడుతున్నారని తెలిపారు.
మంత్రులు కాంట్రాక్టులు, కమిషన్ల వ్యవహారాన్ని ఇంటి పంచాయితీగా మార్చారని, పొంగులేటి తన టెండర్లలో తలదూర్చారని మంత్రి కూతురు స్వయంగా చెప్పిందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలోని దక్కన్ సిమెంట్ కంపెనీ యజ మాని పైన గన్ను గురి పెట్టినప్పుడు కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రోహిన్ రెడ్డిని, సుమంత్‌ను ఎవర్ని కూడా పోలీసులు విచారించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో బీజే పీ జాయింట్ వెంచర్ పరిపాలన నడుస్తున్నదని మండిపడ్డారు.