03-09-2025 12:38:03 PM
చిట్యాల (విజయక్రాంతి): యూరియా కోసం రైతులు చెప్పులను క్యూ లైన్ లో పెట్టి వాటి కాపలా కాస్తున్న రైతుల సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) చిట్యాల మండల కేంద్రంలో జరిగింది. బుధవారం ఉదయం మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు పడిగాపులు కాస్తూ నిల్చున్నారు. నిల్చునే ఓపిక లేక చెప్పులను క్యూ లైన్ లో పెట్టి వాటి కావాలి కాస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతుల జీవితాలను అంధకారంలోకి నెట్టిందని రైతులు వాపోయారు. పనుల దినం పనులన్నీ మానుకొని యూరియా కోసం రోజుల తరబడి వస్తుంటే వ్యవసాయ పనులు నిలిచిపోతున్నాయని మండిపడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి మండల కేంద్రానికి సరిపడ యూరియా నిల్వలను అందజేయాలని వారు కోరారు.