calender_icon.png 3 September, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

03-09-2025 12:35:51 PM

కొమురవెల్లి (విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సాంస్కృతిక మండలి సారధి, కవి గాయకుడు పిన్నింటిరత్నం అన్నారు. కొమురవెల్లి మండలం(Komuravelli Mandal)లోని అయినా పూర్ గ్రామంలో సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై కళా ప్రదర్శన నిర్వహించారు. విష జ్వరాలైన డెంగ్యు, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఇంటి చుట్టుపక్కల మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలన్నారు. జ్వరాలు వచ్చినవారు నిర్లక్ష్యం వహించకుండా సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి బాలనర్సయ్య టీం లీడర్ పిన్నింటి శ్యాంసుందర్, సభ్యులు సనువాల కనకయ్య గెంటే ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు .