03-09-2025 12:28:21 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన పోన్నం కిషోర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇట్టి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దాయం ఝాన్సీ రాజిరెడ్డి తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు(MLA Mandula Samel) దృష్టికి తీసుకువెళ్లగా... ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి శస్త్ర చికిత్సల నిమిత్తం రూ.1,20,000 లు ఇటీవల లెటర్ అఫ్ క్రెడిట్ రూపంలో(ఎల్ఓసి) మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన ఎల్ఓసిను ఎమ్మెల్యే మందుల సామేలు హైదరాబాదులోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. త్వరితగతిన ఎల్ఓసి మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే సామెలుకు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన ఝాన్సీ రాజిరెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.