calender_icon.png 3 September, 2025 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్​పామ్ దిగుమతులపై సుంకాలు పెంచాలి

03-09-2025 01:09:46 PM

హైదరాబాద్: ఇతర దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకోలేదని.. దేశంలో యూరియా సరైన సమయంలో ఉత్పత్తి చేయలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యూరియా కొరత తెలంగాణను కూడా పీడిస్తోందని.. రాష్ట్రానికి 9.8 లక్షల టన్నుల్లో 5.3 లక్షల టన్నులే సరఫరా చేశారని మంత్రి అన్నారు. ప్రతినెలలో సరఫరా చేయాల్సిన యూరియాలో కోత పెట్టారని.. సెప్టెంబర్ లో రావాల్సిన 1.6 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయలేదన్నారు. ఇతర దేశాల నుంచి వస్తోన్న యూరియానే సరఫరా చేస్తున్నారని, రామగుండం పరిశ్రమ నుంచి కూడా ఒక్క బస్తా యూరియా ఇవ్వలేదన్నారు.

యూరియా సరఫరా లేక రాష్ట్ర రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, అన్ని పంటలు సెప్టెంబర్ లో చివరి కోటా యూరియా వేయాలని మంత్రి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఆరేడు జిల్లాలో అన్ని శాఖల్లో తీవ్ర నష్టం వటిల్లిందని, చేనేత రంగంపై పన్నులు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు. అయిల్ పామ్ దిగుమతులపై సుంకాలు 40 శాతానికి పెంచాలన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి కవిత(MLC Kavitha) సస్పెన్షన్ వ్యవహారం మాకు సంబంధం లేదని, కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఇచ్చారు.. ఏం ఉన్నా వాళ్లు చూసుకుంటారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.