03-09-2025 01:33:55 PM
హైదరాబాద్: రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఓకే విమానంలో ప్రయాణించినప్పటి నుంచి తనపై కుట్రలు చేస్తున్నారన్న కవిత(MLC Kavitha) వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(BJP MP Raghunandan Rao) స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, హరీష్ రావు కుమ్మక్కయ్యారని ఎమ్మెల్సీ కవిత చెప్పారని, జడ్పీ అధ్యక్షుడిగా ఎవరు ఓడించారో గతంలో తాను కేసీఆర్ కు చెప్పానని రఘునందన్ రావు పేర్కొన్నారు. ఆరోజు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఇందులో ఎలాంటి దాపరికం లేదని ఆయన అన్నారు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు గతంలోనే తాను చెప్పానని ఎంపీ రఘునందన్ అన్నారు.