calender_icon.png 3 September, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌, హరీష్‌ కుమ్మక్కై నాపై కుట్రలు చేశారు

03-09-2025 01:11:12 PM

  1. నాకు జరిగింది..రేపు రామన్నకు ఇదే జరుగుతుంది..
  2. కేటీఆర్ నుంచి ఫోన్ రాలే... చాలా బాధపడ్డా..
  3. హరీష్‌రావు, రేవంత్‌రెడ్డి ఒకే ఫ్లైట్‌లో పర్యటించినప్పటి నుంచే కుట్రలు..
  4. రేవంత్‌, హరీష్‌రావు కుమ్మక్కయ్యారు..
  5. రేవంత్‌తో హరీష్‌రావు ఒకే ఫ్లైట్‌లో వెళ్లారా లేదా చెప్పండి?-కవిత

హైదరాబాద్: భవన్ లో కూర్చొని నాపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పా.. తప్పేముందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు(Telangana Jagruti President) కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి భవన్ లో బుధవారం కవిత సంచలన మీడియా(Kavitha Press Meet) సమావేశం నిర్వహించారు. మహిళా ఎమ్మెల్సీపై కుట్రలు జరుగుతున్నాయంటే కనీసం ఎవరూ స్పందించరా? అని ప్రశ్నించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి నాకు ఫోన్ రాకపోవడంపై చాలా బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) బిడ్డను నేను.. మాట్లాడితేనే స్పందన రాకపోవడం శోచనీయం అన్నారు. నాకు నోటీసులు రాగానే మహిళలను కూర్చోబెట్టి నాపై విమర్శలు చేయిస్తారా? అని ఆమె క్వశ్చన్ చేశారు. వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వ్యక్తులు నా కుటుంబం బాగుండొద్దని కోరుకున్నారని తెలిపారు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా కుట్ర పన్నారు.. వారికి సంతోషంగా ఉందని చెప్పారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపొచ్చు.. కానీ అన్ని విషయాలు కేసీఆర్ కు తెలియాలని సూచించారు. నేను కేసీఆర్ మాదిరిగానే నేరుగా మాట్లాడుతానని, ఇవాళ నాకు జరిగింది.. రేపు రామన్నకు ఇదే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్ర జరుగుతోందని వెల్లడించారు.

రేవంత్‌, హరీష్‌రావు కుమ్మక్కై నాపై కుట్రలు

హరీశ్ రావు, రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఒకే విమానంలో ప్రయాణం చేసినప్పటి నుంచి నాపై కుట్రలు ప్రారంభమయ్యాయని కవిత వివరించారు. రేవంత్‌, హరీష్‌రావు కుమ్మక్కై నాపై కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. మీరిద్దరూ ఒకే విమానంలో కలిసి వచ్చారా లేదా అనేది రేవంత్, హరీశ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తో కొట్లాడుతున్నాం కాబట్టే కేసీఆర్ కుటుంబంపై కుట్రలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. హరీశ్ రావు(Thanneeru Harish Rao ) పాల వ్యాపారంపై ఆరోపణలన్నీ ఏమయ్యాయి ? అని ప్రశ్నించారు. రంగనాయక సాగర్ వద్ద ఫామ్ హౌస్ ఉంది.. ప్రభుత్వ భూమి కబ్జా చేశారు.. తర్వాత కేసు లేదు.. కేటీఆర్ పై ఎన్ని కేసులు పెట్టారు.. ఎన్నిసార్లు విచారణకు పిలిచారో అందిరికీ తెలుసన్నారు.