11-10-2025 05:14:18 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): రైతు సోదర, సోదరీమణులకు రూ.42,000 కోట్ల విలువైన వ్యవసాయ పథకాలను రూపొందిస్తూ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యక్షప్రసారం కార్యక్రమానికి శనివారం సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు రైతులతో కలిసి వీక్షించారు. అన్నదాతల గౌరవం, సమృద్ధి భారత్ నిర్మాణం కోసం పీఎం ధన్-ధాన్య యోజన, దళహన్ ఆత్మనిర్భర్ మిషన్, వ్యవసాయ అవసర సదుపాయాలు, పశుసంవర్ధక, మత్స్యపాలన, ఆహార ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన 1100కి పైగా పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించి శిలాన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి ఎస్. మనోహర్, డైరెక్టర్లు బొజ్జ మల్లయ్య, బావు రాజేందర్, అప్పాల తిరుమల, పాపని లక్ష్మినారాయణ, బండ శంకర్, ఇల్లందుల శ్రీనివాస్, మార్కెట్ సిబ్బంది తోపాటు రైతులు పాల్గొన్నారు.