11-10-2025 05:10:37 PM
నిర్మల్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో బీసీల ఐక్యత కోసం 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ సంఘం ఆధ్వర్యంలో 14న బంద్ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నేతలు తెలిపారు. శనివారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో సంఘ నాయకులు పున్నం నారాయణ గౌడ్ అనుముల భాస్కర్ కిరణ్ కుమార్ గజేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈ బంద్ లో తెలంగాణలోని బీసీ కులాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు బీసీ సంఘాల పోరాటం ఆగదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.