calender_icon.png 25 November, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం

25-11-2025 12:02:56 AM

 ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి 

అబ్దుల్లాపూర్ మెట్, నవంబర్ 24: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. బాటసింగారం రైతు సేవ సహకార సంఘం 57 వ సర్వసభ సమావేశం వైయల్ ఆర్ గార్డెన్ లో సోమవారం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ రుణాలను సకాలంలో చెల్లించి మళ్లీ రుణాలు పొందాలని సూచించారు. రైతు భరోసా ఇస్తూనే రైతులకు ఏక కాలంలో రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్  ప్రభుత్వానికే దక్కింది. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న వారి నుంచి  రుణాలు వసూలు చేయాలన్నారు.  పేద మధ్యతరగతి వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దని  సూచించారు.  ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  చిలుక మధుసూదన్ రెడ్డి,  వైస్ చైర్మన్ భాస్కర చారి, సింగిల్ విండో డైరెక్టర్లు,  వివిధ గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు..పలు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.