15-10-2025 12:30:17 AM
అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట అక్టోబర్ 14: రాష్ట్రంలోని రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం అచ్చంపేట మండలం పల్కపల్లిలో నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వచ్చిన సంపూర్ణ రాయితీ వేరుశనగను రైతులకు పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని రైతులు దాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాలసీతలీకరణ కేంద్రం చైర్మన్ నర్సయ్య యాదవ్, నేతలు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.