15-10-2025 12:31:45 AM
పెంట్లవెల్లి అక్టోబర్ 14: నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రం మంచాలకట్ట గ్రామం సమీపంలోని కృష్ణా నది ప్రాంతంలో సోమవారం గుర్తు తెలియని మహిళను దుండగులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. మంగళవారం మృతదేహాన్ని డాక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడానికి ఎటువంటి ఆనవాళ్లు లభించక పోయినట్లు వైద్యులు తెలిపారు.
మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు కష్టంగా మారిందని సీఐ మహేష్ తెలిపారు. లివర్ మరికొన్ని అవయవాల సేకరించి టెస్టుల కోసం పంపించామన్నారు. నివేదికలు రావడానికి నెలరోజుల సమయం పడుతుందని నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. వారితోపాటు ఎస్త్స్ర రామన్ గౌడ్ వైద్య సిబ్బంది ఉన్నారు.