calender_icon.png 24 October, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

24-10-2025 12:41:16 AM

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మధుకర్ రెడ్డి 

 జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), అక్టోబర్23: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్ రెడ్డి అన్నారు.గురువారం మండలంలోని జాజిరెడ్డిగూడెం,అర్వపల్లి,కుంచమర్తి,ఉయ్యాలవాడ,లోయపల్లి,కోడూరు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ డైరెక్టర్ జలంధర్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.

రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని,ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ గోపి,ఏపీఎం రాంబాబు,సంఘబంధం సమాఖ్య మండల అధ్యక్షురాలు బొడ్డు స్వప్న,సీసీలు యాదగిరి,నాగార్జున,నాయకులు పాశం భాస్కర్ రెడ్డి,లింగస్వామి,కృష్ణ,నిర్వాహకులు సుజాత,గౌనియశోద,సోమనర్సమ్మ,స్వాతి,రైతులు తదితరులు పాల్గొన్నారు.