calender_icon.png 24 October, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటుగా రిజ్వీకి 10 లక్షల జీతం

24-10-2025 12:44:16 AM

  1. ఆ ఉద్యోగం కోసమే వీఆర్‌ఎస్ 
  2. మంత్రి జూపల్లి కృష్ణారావు 

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఏఐజీ ఆసుపత్రిల్లో నెలకు రూ.10 లక్షల ఉద్యోగం దొరకడంతోనే ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్‌ఎస్ తీసుకున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రభుత్వంలో ఒత్తిడి వల్ల వీఆర్‌ఎస్ తీసుకున్నారని కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి ఖండించారు.

గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టెండర్లు పిలవక ముందే రూ.500 కోట్ల ముడుపులు తీసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అల్లుడు, తన కుమారుడు పేర్లు లాగడం సరికాదని మంత్రి హితవు పలికారు. లిక్కర్‌కు బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల కుటుం బమేనని, లిక్కర్ స్కామ్ నుంచి బయటపడటానికి బీజేపీ వద్ద మోకరిల్లింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగం లో ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలకు అధికారులు నడుచుకోవాలన్నారు. తాను నిజా యితీగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. 

సీఎంకు మంత్రి సురేఖ క్షమాపణలు 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. గురువారం ఆమె సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. “మా ఇంటికి పోలీసులు రావడంతోనే మా కూతురు సుస్మిత ఆవేశంతో మాట్లాడింది. మా కూతురు తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి విభేలూ లేవు. కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తాయి. అన్ని త్వరలోనే సమిసిపోతాయి” అని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.