14-10-2025 07:43:51 PM
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య
నకిరేకల్,(విజయక్రాంతి): రామన్నపేట-కొమ్మాయిగూడెం అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి వద్ద వర్షం వచ్చినప్పుడు ప్రయాకులకు ఇబ్బంది కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య రైల్వే అధికారులను కోరారు.మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం స్థానిక రైల్వే స్టేషన్లో ఎస్ఎస్ కు వినతి పత్రం అందించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే అండర్ పాస్ ముందు చూపు ప్రణాళిక లేకుండా నిర్మించడంతో వర్షం పడిన ప్రతీసారి ప్రయాణాలు స్తంభించిపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వందలాది వాహనాలు హైదరాబాద్ వెళ్ళడానికి ఈ రహదారే ప్రధానం వర్షపు నీరు రావడంతో నిత్యం మండల కేంద్రానికి వచ్చే ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పాడాల్సి వస్తుందని వెంటనే రైల్వే అధికారులు చొరవ చూపి సమస్య పరిష్కరించి నీటిని తొలగించాలని అన్నారు. లేని పక్షంలో ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు.