calender_icon.png 5 September, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యశోద హాస్పిటల్స్ అరుదైన చికిత్స

05-09-2025 01:55:15 AM

  1. త్రీడీ ప్రింటెడ్ టైటానియం ‘టోటల్ ‘టాలస్‘ రీప్లేస్మెంట్’ సర్జరీ విజయవంతం

తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం సీనియర్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి నేతృ త్వంలో తెలుగురాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా త్రీడీ ప్రింటెడ్ టైటానియం ‘టోటల్ ‘టాలస్‘ రీప్లేస్మెంట్’ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. ఈ అత్యాధునిక శస్త్రచికిత్స ప్రక్రియ గురించి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్, సీనియర్ ఆర్థోపెడిక్, రోబోటిక్ సర్జన్, డాక్టర్ సునీల్ దాచేపల్లి వివరిస్తూ..

“కరీంనగర్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల పంకజ్ గత సంవత్సరం తన ఆటోమొబైల్ షాప్‌లో ప్రమాదవశాత్తు జారిపడటం తో కుడి కాలు చీలమండకు తీవ్ర గాయం అయింది. అప్పటి నుంచి క్రమంగా చీలమండ ఎముక (టాలస్)కు రక్త ప్రసరణ కోల్పోయి (అవాస్కులర్ నెక్రోసిస్) అని పిలువబడే విషమపరిస్థికి చేరుకొని, క్రమం గా చీలమండ ఎముక (టాలస్) కుళ్ళిపోయింది.

గత నెలలో తీవ్రమైన నొప్పి, నడవలేని స్థితిలో మా వద్దకు వచ్చిన పంకజ్‌ను పరీక్షించి, రోగి యొక్క వయస్సు మరియు చురుకైన జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని మా శస్త్రచికిత్స వైద్య బృందం, అధునాతన పరిష్కారం అయిన కస్టమ్-మేడ్ త్రీడీ ప్రింటెడ్ టైటానియం టాలస్ ఎముకను రూపొందించేందుకు వైద్యప్రక్రియను ఎంచుకుంది. పంకజ్ ఆరోగ్యకరమైన ఎడ మ కాలు చీలమండ సీటీ స్కాన్ రిపోర్ట్‌ను ఉపయోగించి ఖచ్చితమైన ప్రతిరూపాన్ని రూపొందించడానికి ఈ ప్రక్రియను జాగ్రత్తగా ప్లాన్ చేశాము.

బయోకాంపాజిబుల్, మన్నికైన లోహం అయిన టైటానియంతో అత్యాధునిక త్రీడీ టెక్నాలజీ సహాయంతో కస్టమ్-మేడ్ త్రీడీ ప్రింటెడ్ టైటానియం కొత్త టాలస్ ఎముకను రూపొందించాం. దాన్ని కొన్ని వారాల క్రితం నిర్వహించిన శస్త్రచికిత్సలో పంకజ్‌కు చీలమండ మార్పిడి ద్వారా అమర్చాం. ఇప్పుడు పంకజ్ నొప్పి లేకుండా నడవగలుగుతున్నాడు” అని డాక్టర్ సునీల్ దాచేపల్లి తెలిపారు.

ఈ సందర్బంగా యశో ద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, మాట్లాడుతూ.. “తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో విజయవంతమైన అత్యాధునిక ‘చీలమండ మార్పిడి‘శస్త్రచికిత్సతో 38 ఏళ్ల తెలంగాణ వ్యాపారికి సరికొత్త జీవితం ఇవ్వడం యశోద హాస్పిటల్స్ గ్రూపుకు గర్వకారణం” అన్నారు. అందుకు డాక్టర్ సునీల్ దాచేపల్లి, అతని టీం డాక్టర్లు అయిన డాక్టర్ లోకేష్‌గుప్త, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ వినయ్‌ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.