calender_icon.png 19 May, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగవంతంగా ఆర్.వై. వీ దరఖాస్తుల పరిశీలన

17-05-2025 01:01:08 AM

బి.సి. సంక్షేమ శాఖ అధికారి ఎం.నరసింహస్వామి

మహబూబాబాద్, మే16(విజయ క్రాంతి):రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనను వేగవంతంగా పూర్తి చేయాలని బి.సి. సంక్షేమ శాఖ అధికారి ఎం.నరసింహస్వామి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బి.సి సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ దేశి రామ్ నాయక్, ఎల్.డి.యం సత్యనారాయణ మూర్తితో కలిసి రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనపై మహబూబాబాద్ వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారి నుండి హార్డ్ కాపీలు రాని యెడల వారికి ఫోన్ చేసి కాపీలు త్వరగా వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా బ్యాంకుల నుండి సిబిల్ వెరిఫికేషన్ నివేదికలను త్వరగా  తీసుకు వచ్చి ఇచ్చిన టార్గెట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వార్డ్ ఆఫీసర్లు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..