17-05-2025 01:01:44 AM
-యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మనోజ్‌రెడ్డి
ముషీరాబాద్, మే 16 (విజయక్రాంతి): ప్రపంచ రక్తపోటు దినోత్స వాన్ని పురస్కరించుకోని శనివారం ముషీరాబాద్ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీ హెచ్సీ)లో రక్త పోటుపై అవగాహన సదస్సు, వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ముషీరాబాద్ యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మనోజ్ రెడ్డి శుక్రవారం తెలిపారు.
రక్తపోటు లక్షణాలు గల వ్యక్తికి అధికంగా తలనొప్పి, దృష్టి సమస్య, ముక్కునుంచి రక్తం కారడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, నీరసం, మూత్రపిండాల పనితీరు క్షీణించడం తదితర లక్షణాలతో బాధపడు తారని తెలిపారు. ఈ లక్షణాలు ఉన్నవారు సకాలంలో వైద్యులను సంప్రదిం చి వైద్య సేవలు పొందితే రక్త పోటును తగ్గించవచ్చు అని అన్నారు. రక్తపోటు పై ఆసుపత్రిలో నిర్వహించే అవగాహన సదస్సు, వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.