23-10-2025 01:09:29 AM
-పలు వాహనాలు ఢీకొని..63 మంది దుర్మరణం
కంపాల, అక్టోబర్ 22 : ఉగాండా రాజధాని కంపాలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని గులు రోడ్డుపై మంగళవారం రాత్రి పలు వాహనాలు ఢీకొని 63 మంది దుర్మరణం చెందారని అక్కడి అధికారులు తెలిపారు. గులు హైవేపై ఓ బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేస్తూ.. ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టాడు.
వెంటనే డ్రైవర్ బస్సును మరో వైపునకు తిప్పడంతో పక్కన.. ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొట్టుకొని బోల్తాపడంతో ప్రమాదం సంభవించింది. దీంతో ఆయా వాహనాల్లో ప్రయాణిస్తున్న 63మంది మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్రమాదానికి వాహనాల అతివేగం, ఓవర్ టేకింగ్ చేయడమే కారణమని భావిస్తున్నారు.