23-10-2025 12:58:48 AM
-మిస్టరీగా లౌవ్రే మ్యూజియం చోరీ
-పింక్ పాంథర్స్‌పై అనుమానం
పారిస్, అక్టోబర్ 22: ఫ్రాన్ రాజధాని పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధ ఆర్ట్ మ్యూజియంలో ఆదివారం జరిగిన భారీ దొం గతనం తీవ్ర సంచలనం సృష్టించింది. మో నాలిసా చిత్రం ఉన్న లౌవ్రే మ్యూజియంలో దుండుగులు చొరబడి నిమిషాల వ్యవధిలో నెపోలియన్ కాలానికి చెందిన అత్యంత విలువైన తొమ్మిది నగలను ఎత్తుకెళ్లారు. చోరీ అయిన అభరణాలు విలువ సుమారు రూ.895 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ చోరీపై ఫ్రాన్స్ దర్యాప్తు ప్రారంభించింది.
ఈ చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు దాదాపు 100 మందితో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దొంగతనం చేసింది ఎవరనేది ఇంతవరకూ తేలలేదు. అయితే కరుడు గట్టిన దొంగల ముఠా పింక్ పాంథర్స్ పని అయి ఉండొచ్చననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ఆధా రాలేనప్పటికీ దొంగతనం జరిగిన తీరు ఆ ముఠాను గుర్తుకు తెస్తోంది. ఈ దొంగల ముఠా గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా భారీ చోరీలకు పాల్పడింది. అందరూ చూస్తుండగానే చోరీలు చే యడం వీరి నైజం.
కేవలం ఆభరణాలు, వజ్రాలనే దోచుకుంటారు. ఓసారి ఈ పింక్ పాంథర్స్ గ్యాం గ్ దుబాయ్‌లోని ఓ మా ల్‌లో చోరికి పాల్పడింది. ఆ మాల్‌లోని నగ ల దుకాణంలోకి కార్లతో దూసుకెళ్లి చేతికందినన్ని వజ్రాలు, ఆభరణాలు తీసుకుని కేవ లం 45 సెకన్లలో అక్కడి నుంచి పరారయ్యారు. జపాన్, బ్రిట న్ చరిత్రల్లోనే అతిపెద్ద నగల చోరీకి పాల్పడింది ఈ గ్యాంగే. ప్రముఖ హాలివుడ్ చిత్రం పింక్ పాంథర్‌లో చూపించిన ఓ ట్రిక్ లాంటిదే 2003లో లం డన్‌లోని ఓ నగల దుకాణంలో వజ్రాలను చోరీ చేశారు. అప్పటినుంచి ఈ గ్యాంగ్‌కి పింక్ పాంథర్ అని పేరొచ్చింది.
కాగా మూడు రోజుల క్రితం ‘మ్యూజియంలో చోరీకి పాల్పడిన వారు దొంగతనాల్లో ప్రొఫెషనల్స్‌గా కన్పించారు. ఇంతవరకూ ఆచూకీ దొరకలేదు. పక్కా సమాచారం, ప్రణాళికతో దొంగతనానికి పాల్పడటం చూస్తుంటే పింక్ పాంథర్స్ పనే అనిపిస్తోంది’ అని ఫ్రాన్స్ స్కాడ్‌బూ ‘ది స్వీనీ’ మాజీ చీఫ్ బ్యారీ ఫిలిప్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు 35 దేశాల్లో దాదాపు 500 మిలియన్ డాలర్ల ఆభరణాలను ఈ గ్యాంగ్ దొంగిలించినట్లు ఆధారాలున్నాయి.