18-05-2025 12:21:52 AM
మంథని, మే 17 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో జరుగుతున్న పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై సరస్వతీ అమ్మవారు, కాళేశ్వరం ముక్తీశ్వర స్వామివారి ఆశీస్సులు పొందాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సరస్వతీ పుష్కరాల్లో భాగంగా మూ డోరోజైన శనివారం 3 లక్షల మంది పుణ్యస్నానం ఆచరించారు.
మొదటగా పుష్పగిరి పీఠాధిపతి అభినవో దండ విద్వాశంకర భారతి స్వామి స్నా నమాచరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుష్కరాలకు హాజరై, నదీస్నానం చేశారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం సరస్వతీ ఘాట్‌లో సోదరుడు మల్లు ప్రసాద్‌తో కలిసి డిప్యూటీ సీఎం భటి పెద్దలకు పిండప్రదానం చేశారు.
అనంతరం సరస్వతీ పుష్కర ఘాట్‌లో స్నానమాచరించి కాళేశ్వర శివాలయంలో కుటుం బ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలను ఆచరిస్తూ సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారని తెలిపారు.
పుష్కర స్నానంతో విజయాలు సాధిస్తారని, తప్పు లు, పొరపాట్లు, పాపాలు తొలగిపోతాయని, మంచి మనసుతో అమ్మవారిని కోరుకుంటే అన్ని సవ్యంగా, సక్రమంగా జరుగుతాయని చెప్పారు. తాను అమ్మవారిని, ముక్తీశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉం డాలని, నదులు సక్రమంగా పారుతూ పాడి పంటలతో తెలంగాణ విరాజిల్లాలని, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రాష్ట్రం ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలని అమ్మవారిని కోరుకుంటున్నానని తెలిపారు. ఏర్పాట్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
పాడి పంటలతో వర్థిల్లాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండి, పా డి పంటలతో వర్థిల్లాలని సరస్వతీ అమ్మవారిని కోరుకున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 10 గంటలకు కాళేశ్వరం చేరుకున్న మం త్రి త్రివేణి సంగమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, భూపాలపల్లి, రామ గుండం ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మక్కన్ సింగ్ లతో పుష్కర స్నా నం ఆచరించి, సరస్వతీ మాతను దర్శించుకున్నారు.
తదుపరి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మ ల మాట్లాడుతూ.. భక్తులు సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానా లు ఆచరించాలని కోరా రు. స్వామి వారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్టు తెలిపారు. ఆయనవెంట కలెక్టర్ రాహు ల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డీవో రవి, దేవాదా య ధర్మాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు ఉన్నారు.
భక్తజన జాతరగా త్రివేణి సంగమం
భక్త జన జాతరతో కాళేశ్వరం కళకళలాడుతోంది. సరస్వతీ నది పుష్కరాల్లో భాగంగా మూడోరోజూ భక్తులు పోటెత్తారు. శనివారం సుమారు 3 లక్షలకు పైచిలుకు భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమం ప్రాంతాన గల సరస్వతీ నదిలో పుష్కర స్నానాలు ఆచరించి సైకత లింగాలను పూజించారు.
కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వా మిని దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయంలో భక్తులు సుమా రు 3 నుంచి 4 గంటల వరకు క్యూలో వేచి చూశారు. కాగా నదీ తీరంలో భక్తులు ఎండ కు ఇబ్బందులు పడుతున్నారు. నది నుంచి మెట్ల వరకు నడుచుకుంటూ రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వద్ద చలివేంద్రాలు పెంచాలని కోరుతున్నారు.
వాహనాల రద్దీతో భక్తుల ఇబ్బందులు
సరస్వతీ పుష్కరాలకు శనివారం భక్తులు పోటెత్తడంతో కాళేశ్వరం-మహాదేవ్‌పూర్ ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ బైకుపై తిరిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. శనివారం వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది.
సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు ఇద్దరు తమ కాన్వాయిలను పక్కన పెట్టి బైకుపై తిరుగుతూ ట్రాఫిక్ ను క్లియర్ చేకశారు. శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేసిన ఎస్పీ, కలెక్టర్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
నేలకూలి టెంట్లు
శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులు రావడంతో పుష్కర ఘాట్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులు చెల్లాచెదురయ్యాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, చలువ పందిళ్లు, విద్యుత్‌దీపాలు నేలకూలాయి. కూలిన పందిళ్లను సింగరేణి రిస్క్యూ టీం తొలగించింది.
పుష్కరాల సందర్భంగా చేసిన రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. కాళేశ్వరం గ్రా మం నుంచి వీఐపీ పుష్కర ఘాట్ వరకు రోడ్లు బురదమయం అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు భక్తులకు ఇబ్బం దులు లేకుండా యుద్ధప్రాతిపదికన కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు.