18-05-2025 12:48:45 AM
అభివృద్ధికి చిరునామాగా సిద్ధమవుతున్న పీఎల్‌డీపీ-2031
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంతూరులో సరికొత్త అధ్యాయం
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): కొండారెడ్డిపల్లి.. ఒకప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామాల మాదిరి గానే ఇదొక పల్లెటూరు. ఎంతో వెనకబడిన ఈ పల్లెటూరు ఇప్పుడు అభివృద్ధిపథంలో దూసుకుపో యేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి.. గతంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు రాష్ట్రాధినేతగా రేవంత్ ఉన్న నేపథ్యంలో స్వగ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
సరికొత్త సొబగులు అద్దుతూ ముఖ్యమంత్రి జన్మభూమికి కొత్తరూపు ఇస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొండారెడ్డిపల్లి ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలంలో ఉంది. నిజాం పాలనలో సర్ఫ్--ఎ--ఖాస్ పరిధిలో ఉండి, సరైన వనరులు, పాలకులు లేక వెనుకబడింది కొండారెడ్డిపల్లి. సర్ఫ్--ఎ--ఖాస్ అంటే నిజాం సొంత భూములు లేదా ఎస్టేట్లు.
ఈ ప్రాంతాల పరిపాలన ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉండేది. చుట్టుపక్కల గ్రామాలకు తహసీల్దార్ వంటి పాలనాధికారులు ఉండగా, ఈ గ్రామం మాత్రం సరైన పర్యవేక్షణ లేక ఇబ్బందులు పడింది. ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి ప్రణాళికాబద్ధంగా సాగుతోంది.
గతంలో అభివృద్ధి ప్రయత్నాలు జరిగినా..
గతంలో ఏపీఈఆర్‌ఎల్‌పీ ద్వారా అభివృద్ధికి ప్రయత్నాలు జరిగినా, సరైన ప్రణా ళిక లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. 2002--05 మధ్య కాలంలో గ్రామపంచాయతీ బాధ్యతలు చేపట్టిన దివంగత అనుముల పెద్దకృష్ణారెడ్డి, అభివృద్ధి కోసం ఎస్వీ యూనివర్సిటీ స్కాలర్స్‌ను సంప్రదించి సమగ్ర ప్రణాళిక రూపొందించారు. దీని ఫలితంగా అభివృద్ధి, బ్యాంకింగ్ కార్యక్రమా లు ఒక కొలిక్కి వచ్చాయి.
నాబార్డ్ కూడా తొలిసారిగా ఇక్కడ వీవీవీ క్లబ్‌ను ఏర్పాటు చేసింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా గత దశాబ్దకాలంగా ఈ గ్రా మం మళ్లీ వెనుకబాటుకు గురైంది. పదేళ్లు పాలించిన నేతలు ఈ గ్రామాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా ఉన్న అభివృద్ధిని ఆపేశారు. కానీ ఇప్పుడు ఆ గ్రామంలో పుట్టినబిడ్డే రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.
అభివృద్ధి, రాజకీయాలపై అవగాహన ఉన్న గ్రామ ప్రజలు..గ్రామ అభివృద్ధిపై ప్రముఖులు, ఆర్థిక నిపుణలతో కొంతకాలంగా విస్తృతంగా చర్చిస్తున్నారు. దీని ఆధారంగా పీఎల్‌డీపీ- -2031 సామర్థ్య ఆధారిత అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
సుస్థిరతే లక్ష్యంగా భవిష్యత్ ప్రణాళిక
కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి ప్రణాళిక అనేది ప్రజలు, భూమి, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఒక సమగ్రమైన ప్రణాళిక. పొటెన్షియల్ లింక్డ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (పీఎల్‌డీపీ--2031)లో మూడు అంశాలు ప్రధానమైనవి.
1. ప్రజలు..
ఇది జిల్లా యంత్రాంగం ద్వారా అమలు చేయబడుతుంది. దీనికింద ఇప్పటికే ఆదర్శ గ్రామాల ప్రణాళిక కింద చాలా కార్యక్రమాలు వివిధ దశల్లో ఉన్నాయి.
2. భూభాగం..
భూమిని ఎలా ఉపయోగించాలనే దాని పై స్పష్టమైన ప్రణాళిక ఉంది. దీనిద్వారా రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూస్తా రు. ఇందులో ముఖ్యంగా పంటలు పండించే భూములు, రైతుల -పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రాంతాలు, తోటల పెంపకం, వ్యవసా య పర్యాటకం వంటి వాటిపై దృష్టి పెడతారు. స్థానికంగా ఎంపికైన ప్రజాప్రతినిధులే పూర్తి బాధ్యతతో పనిచేస్తారు. ప్రభుత్వం సమన్వయం చేస్తుంది.
3. సుస్థిరత..
2031నాటికి కొండారెడ్డిపల్లిని ఎస్‌డీజీ నమూనా గ్రామంగా మార్చాలనేది ప్రణాళిక లక్ష్యం. దీని కోసం పలు కార్యక్రమాలను అమలు చేస్తారు. పూర్తి బాధ్యత ప్రజాప్రతినిధులదే. ప్రభుత్వానికి నామమాత్రపు జోక్య మే ఉంటుంది.
పీఎల్‌డీపీతో ఎన్నోప్రయోజనాలు
సామర్థ్య ఆధారిత అభివృద్ధి ప్రణాళిక (పీఎల్‌డీపీ) అమలుచేయడం వల్ల ఆర్థికంగా గ్రామం అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు ఎక్కువ ఆదాయం, ఉద్యోగాలు వస్తాయి. పర్యావరణం బాగుంటుంది, పునరుత్పాదక ఇంధన వనరులు ఏర్పాటు అవుతాయి. ప్ర జల జీవన నాణ్యత పెరుగుతుంది, అందరికీ ఆరోగ్య బీమా, పెన్షన్ పథకాలు అందుబాటులోకి వస్తాయి. సుస్థిర ఆర్థిక వ్యవస్థను కొండారెడ్డిపల్లి సాధించగలుగుతుంది.
* సాయిల్ గ్రిడ్ పద్ధతిలో మొదటగా గ్రామ సమగ్ర భూసార డేటాబేస్‌ను పాలెం కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ యూనివర్సిటీ రూపొందిస్తుంది. దీనిలో దాదాపు 40 శాతం భూభాగం (సుమారు 2వేల ఎకరాలు) అధిక ఉత్పత్తి అవకాశాలు కల్గిన నేలలను ఫోకస్ ఏరియాగా గుర్తించి, ఆధునిక వ్యవసాయ కార్యక్రమాలను అమలు చేస్తారు. ఈ ప్రణాళికను సంపూర్ణంగా వ్యవసాయరంగంలో గ్రామంలోని దాదాపు 300 రైతు కుటుంబాలకు ఏడాదికి సగటున రూ.7.5 లక్షల ఆదాయం వస్తుంది. పాల ఉత్పత్తి, పశుగ్రాసం, ఉద్యానవనం, పశుసంపద ద్వారా వచ్చే అదనపు ఆదాయం వేరుగా ఉంటుంది.
* దాదాపు 30 శాతం భూభాగం(సుమారు 1,500 ఎకరాలు) పీఎల్‌డీపీ ద్వా రా వ్యవసాయ, పర్యావరణ పర్యాటక రంగాలను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా గ్రా మాన్ని బలోపేతం చేస్తారు. దీనిద్వారా గ్రామంలోని దాదాపు 300 రైతులకు చేకూరుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఉన్న చిన్న రైతుల కమతాలలో ఉద్యానవనాలు, మసాలా ద్ర వ్యాలు పండించే ఏర్పాట్లు చేస్తారు. వ్యవసాయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం వ ల్ల 3 ఎకరాల భూమి ద్వారా ఏడాదికి దా దాపు రూ.6లక్షల ఆదాయం వస్తుంది.
* దాదాపు 30 శాతం భూభాగం (సుమారు 1,500 ఎకరాలు ) పీఎల్‌డీపీ ద్వారా ఏర్పాటు చేసే చిన్నతరహా రైతు-పరిశ్రమల నుంచి కనీసం 18% లాభం వస్తుంది. రైతులే తమ పొలాల్లో పర్యావరణ అనుకూలమైన పరిశ్రమలు నెలకొల్పుతారు. దీనికి ఇండస్ట్రియల్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ సొసైటీని రాష్ర్ట చట్టం కింద ఏర్పరుస్తారు. గ్రామీణ యువతకు పూర్తిస్థాయి ఉద్యోగాలు, మహిళలకు నీడ పట్టుకుచేసే పార్ట్‌టైం ఉద్యోగాలు లభిస్తాయి. విద్యుత్ సంస్కరణలను వినియోగించడం ద్వారా మిగులు విద్యుత్ గ్రామంగా నిలిచి 12- లాభం ఆర్జించవచ్చు. ఇందుకోసం సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై ఎక్కువ దృష్టి పెడతారు.
2031 లక్ష్యంగా..
2031నాటికి కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఎస్‌డీజీ నమూనా గ్రామంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు, పంటల బీమా, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అందుబాటులో ఉంచడం, పారిశ్రా మిక కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు, మహిళలకు ఉద్యోగాలు కల్పించడం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. మహిళలకు మంచిపని వాతావరణం ఉండేట్లు చూడటంపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది.
సౌర విద్యుత్ ద్వారా 2031 నాటికి కొండారెడ్డిపల్లి విద్యుత్ మిగులును సాధించడం ధ్యేయంగా సర్కారు పావులు కదు పుతోంది. గ్రామంలోని ప్రతీ కుటుంబానికి ఆరోగ్య బీమా, 50ఏళ్లు పైబడిన వారికి పెన్ష న్, పిల్లలు ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా అధికారులు నిర్ధేశించుకున్నారు. ఇవన్నీ సాధించ డం ద్వారా కొండారెడ్డిపల్లెను దేశానికే ఆదర్శ గ్రామంగా నిలబెట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
ఆకట్టుకునేలా స్వాగత తోరణాలు..
గ్రామంలో ప్రవేశించగానే ఆకట్టుకునేలా ఉండేలా నాలుగు వైపులా స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తున్నారు.
1. ఉత్తర ద్వారం (దుందుభి ద్వారం): డిండీ నది సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ తూర్పు శివారు దిండి పరిధి ప్రారంభబిందువుగా ఉంటుంది.
2. తూర్పు ద్వారం (కొండవీడు ద్వారం): నాటి పాలకుల వంగవీడు కొండవీడు పాలకుల సరిహద్దు (వంగూరు, కొండారెడ్డిపల్లి)ను పురస్కరించుకొని కొండవీడు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ తూర్పు ద్వారం ఉంటుంది.
3.దక్షిణ ద్వారం (గోన గన్నారెడ్డి ద్వారం): గోన గన్నారెడ్డి రహస్య యుద్ధ యాత్ర శ్రీశైలం, ఉప్పునుంతల మార్గంలో ఈ గ్రామం ఉంటుంది. కాకతీయులు, గోన బుద్ధారెడ్డి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ స్వాగత తోరణం ఉంటుంది.
4. పడమర ద్వారం (తిమ్మరాజు ద్వారం): శ్రీకృష్ణదేవరాయుల కాలాన్ని సూచిస్తూ, నిజాం రాష్ర్టంలోని అవుకు ఎస్టేట్ సభ్యు ల పరిధిలో ఉన్న తిమ్మరాజుపల్లెను గుర్తుచేస్తుంది. శ్రీకృష్ణదేవరాయుల సాం స్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
యాగంటి బసవన్న విగ్రహ ప్రతిరూపం ఏర్పాటు...
గ్రామానికి బనగానపల్లి రాష్ర్టంతో(ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కాలంలో) సహజ సంబంధం ఉంది. స్థానిక పశుపోషణలో బసవన్న పూజ ప్రముఖంగా ఉండేది. ఈ పునఃస్మరణగా గ్రామంలో అత్యున్నత ప్రాంతంలో యాగంటి బసవన్న ప్రతిరూప విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు.
వాతావరణ కేంద్రం, వ్యవసాయ బీమా భాగస్వామి..
గ్రామంలో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇది రాష్ర్ట, జాతీయ డేటా కేంద్రాలకు అనుసంధానంగా ఉంటుంది. అలాగే వ్యవసాయం, పశుసంవర్ధన బీమాపై ప్రత్యక్షంగా రైతులతో పనిచేసే ఏజెన్సీని ఏర్పాటుచేయనున్నారు.
ఆధునిక డిజిటల్ భూరికార్డు రూమ్ అభివృద్ధి..
గ్రామానికి పొరుగున్న గ్రామాలతో భూ సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామం మొదట షాబాద్ తాసిల్‌లో భాగంగా ఉండేది. స్వాతంత్య్రానికి ముందు నుంచే గ్రామస్థులకు సమస్యలు ఉన్నాయి. నక్సలైట్ విధ్వంసంలో కొంత రెవెన్యూ డేటా నాశనం అయ్యింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామానికి సంబంధించిన మొత్తం 511 రెవెన్యూ సర్వే నంబర్లు, గ్రామకంఠం, జలవనరులు, సార్వజనికవసతులు, వ్యక్తిగత ఆస్తులు, స్వామిత్వ ఆస్తులకు పాత డేటా బ్యాకప్ అవసరం ఉంది. ఇందుకోసం ఆధునిక డిజిటల్ భూరికార్డుల సదుపాయ కేంద్రం ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేయనున్నారు.
బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు కేంద్రంగా..
గ్రామప్రజలు సరైన ఆరోగ్య బీమా, పెన్ష న్ ప్లాన్, భవిష్యత్ కోసం నిధుల ఏర్పాటుకు పబ్లిక్ సెక్టార్ యూనిట్ల సహాయంతో ఈ కేం ద్రం సహాయపడుతుంది. ఇది చిన్నారులు, వృద్ధుల భద్రతను నిర్ధారించి బాధ్యతాయు త సమాజ అభివృద్ధికి దోహదపడుతుంది.
సంస్థాగత రుణ మద్దతు కేంద్రం అభివృద్ధి..
లీడ్ జిల్లా మేనేజర్, ఇతర ఆర్థిక సంస్థల సహకారంతో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, వలంటీర్లకు వేదిక. అధిక వడ్డీ రేట్లతో అప్పుల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు రుణ మద్దతు కేంద్రం సాయపడుతుంది. రా బోయే రెండు సంవత్సరాల్లో 100శాతం సంస్థాగత రుణం లక్ష్యంగా ఉంది. పట్టాదా రు అనుమతితో సంబంధం లేకుండా కౌలు రైతుకు సీకేవైసీ ఆధారంగా రుణ మద్దతును పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. దేశంలోనే ఇది కొండారెడ్డిపల్లెలోనే ప్రథమం.
ప్రత్యేక పర్యాటక ప్రాజెక్ట్..
కొండారెడ్డిపల్లి వ్యవసాయ పర్యాటక ప్రాజెక్ట్ (1500 ఎకరాల తోటల ప్రాంతం లక్ష్యం) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్--శ్రీశైలం రహదారిపై ఉన్న కొండారెడ్డిపల్లి వ్యవసాయ పర్యాటకానికి చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడకు చాలా మంది పర్యాటకులు వస్తుండటంతో గ్రామంలోని అందమైన ప్రకృతిని, సంస్కృతిని, వ్యవసాయ పద్ధతులను వారికి పరిచ యం చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
పర్యాటక ప్రాజెక్ట్ లక్ష్యాలు:
* పర్యాటకం ద్వారా స్థానిక ప్రజలకు అదనపు ఆదాయం వచ్చేలా చూడటం.
* ప్రాంతం యొక్క సంస్కృతి, సంప్రదాయాలను పర్యాటకులకు తెలియ జేయడం.
* స్థానిక రైతులు తమ ఉత్పత్తులను నేరుగా పర్యాటకులకు అమ్మే అవకాశం కల్పించడం.
* పర్యావరణాన్ని కాపాడే పద్ధతులను ప్రోత్సహించడం.
ప్రాజెక్ట్ భాగాలు:
* వ్యవసాయ పర్యాటక క్షేత్రం ఏర్పాటు చేయడం. ఇక్కడ ఆధునిక వ్యవసాయ పద్ధతులు చూపిస్తారు. ఫామ్‌స్టేల ద్వారా బస చేసే సౌకర్యం ఉంటుంది.
* స్థానిక వంటకాలను ప్రోత్సహించడం. స్థానిక ఉత్పత్తులతో వంటకాలు తయారుచేయడం, వాటి గురించి చెప్పడం, వంట తరగతులు నిర్వహించడం.
* సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. సాంప్రదాయ నృత్యాలు, జానపద సంగీతం, స్థానిక కళాఖండాలు ప్రదర్శించడం.
* పర్యాటకులకు కావలసిన సేవలు అందించడం. భోజనం, బస, రవాణా వంటి సౌకర్యాలు కల్పించడం.
ప్రయోజనాలు..
* స్థానిక ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారాలు చేసేవారి ఆదాయం పెరుగుతుంది.
* ప్రాంతం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవడంతో పాటు, వాటి ని ప్రోత్సహించినట్లవుతుంది.
* పర్యావరణాన్ని కాపాడే పద్ధతులను పాటించడం.
* గ్రామంలో సామాజిక అభివృద్ధి జరుగుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు మెరు గుపడతాయి.
దీని అమలు కోసం స్థానిక ప్రజలు, రైతు లు, అందరితో కలిసి పనిచేస్తారు. కావలసిన మౌలిక సదుపాయాలు అంటే ఫామ్ స్టేలు, ఇతర సౌకర్యాలు అభివృద్ధి చేస్తారు. ఇందు కు తగ్గ నైపుణ్యాల కోసం స్థానిక ప్రజలకు శిక్షణ ఇస్తారు. ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు పరిశీలించి పర్యవేక్షిస్తుంటారు.
గ్రామీణ సేవారంగ ఆదాయ ఉత్పత్తి
తెలంగాణలో ప్రజల తలసరి ఆదాయం సుమారు రూ.2.74లక్షలు. ఇది ఏటా 7% పెరుగుతుందని అనుకుంటే, 2031నాటికి ఇ ది దాదాపు రూ.4.51 లక్షలు అవుతుంది. 2031 నాటికి తలసరి ఆదాయానికి రెట్టింపు అంటే ఏడాదికి రూ.9.02 లక్షలు. ఒక కుటుంబానికి 3ఎకరాల భూమి ఉంటే, వ్యవసాయ పర్యాటకం ద్వారా ఏడాదికి దాదాపు రూ.6-9 లక్షల ఆదాయం వచ్చేలా చూడాలని అంచనా వేస్తున్నారు.
ఇండో--జపనీస్ చికిత్స కేంద్రంగా ఔషధ, సుగంధ ఉద్యానవన పునరుద్ధరణ
2006లో గ్రామంలో దేశంలోనే ఉత్తమ ఔషధ, సుగంధ ఉద్యానవనం ఉండేది. ఇప్పుడు దీనిని పునరుద్ధరించి వివిధ రక్షణ బలగాలు, గాయపడిన సిబ్బంది కోసం పునరావాస కేంద్రంగా మార్చారు. ఇది ట్రాన్స్-డిసిప్లినరీ హెల్త్ సెన్సైస్ ఆధారంగా నిర్మితమవుతుంది. ఇది టిబెటన్-జపనీస్ వైద్య విధానాలతో సహా ఆధ్యాత్మిక సాధనల (యోగ)తో కూడిన తొలి చికిత్స కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నది. సేవలు పరిమిత సంఖ్యలో కొందరికి మాత్రమే లభిస్తాయి.
గ్రామ ప్రత్యేక అవసరాలపైనా దృష్టి..
కొండారెడ్డిపల్లి సంస్కృతిక వారసత్వం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో గ్రామంలో హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణం చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఈ పున ర్నిర్మాణ ప్రక్రియను చేపట్టారు. హనుమాన్ దేవాలయంలో ఉత్సవాల్లో భాగంగా శిల్పాలను సైతం బహూకరించారు.
గ్రామ దేవాలయానికి తంజా వూరు శైలిలోని నాటరాజస్వామి (కంచు విగ్రహం తంజావూర్ నమూ నా), తిరువళ్లూరు వీర రాఘవస్వామి, పెరుమాళ్ ప్రతిరూప విగ్రహాలు బహూకరిస్తున్నారు. గత శతాబ్దంలో గ్రామంలో ఉన్న ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే విగ్రహాలు శిథిలమైపోయిన దశలో వాటిని పునఃప్రతిష్ఠ చేసే ప్రయత్నంగా ఈ విగ్రహాలను సీఎం రేవంత్‌రెడ్డి కుటుం బం బహుమతిగా ఇస్తోంది. గ్రామంలోని ఈ దేవాలయం ఇప్పుడు సరికొ త్త రూపు సంతరించుకునేందుకు సిద్ధమవుతున్నది.
సామాజికంగానూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా..
పీఎల్‌డీపీ ద్వారా ఆర్థికపరంగానే కాక సామాజికపరంగానూ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు. సురక్షితమైన, సంతోషకరమైన సమా జం ఏర్పాటు చేసే దిశగా ప్రతి కుటుంబానికీ ఆరోగ్య బీమా, పెన్షన్ పథకా లు ఉంటాయి. కుటుంబపోషణ కోసం ఆదాయమార్గాలు అందుబాటులోకి వస్తాయి.
దీని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇప్పటికే మంచి ఫలితాలు ఇచ్చిన ఆర్థిక విధానాలను అనుసరిస్తారు. సాధారణంగా పట్టణ ప్రజలకు అందు బాటులో ఉండే పెట్టుబడి పథకాలు, ఈక్విటీలు, స్కీంలను బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తారు.
అనుసంధాన బస్సు రూట్లు..
గ్రామం భారీ రహదారి మౌలికసదుపాయాల అభివృద్ధి కొనసాగు తోంది. మొత్తం గ్రామానికి రెండు జాతీయ రహదారులు, రెండు అంతర్ జిల్లా రోడ్డుమార్గాలు ఉన్నాయి. విజయవాడ, బెంగళూరు, హైదరాబా ద్‌లతో సంప్రదాయ మార్గాలను పునరుద్ధరించడం అవసరం. అందుకోసం ఇప్పటికే ఉన్న బస్సులకు తోడు కింద పేర్కొన్న మార్గాల్లో బస్సులు మళ్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇవీ నూతన బస్సు రూట్లు..
* కొండమల్లెపల్లె నుంచి బాదేపల్లె వరకు వయా కొండారెడ్డిపల్లె (విజయవాడ, బెంగళూరు హైవే మార్కెట్ అనుసంధానానికి)
* చెర్కుపల్లె గేట్ నుంచి మహబూబ్‌నగర్ వరకు వయా కొండారెడ్డిపల్లె, వంగూర్ మార్గంలో
* కొండారెడ్డిపల్లె నుంచి మెహిదీపట్నం రైతుబజార్ (హైదరాబాద్)
* కొండారెడ్డిపల్లె నుంచి లింగంపల్లి (హైదరాబాద్)