calender_icon.png 29 August, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

29-08-2025 05:17:41 AM

తెలుగు సంక్షేమ భవన్ ముట్టడిలో ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 28 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజుల బకాయిలు, స్కాలర్షిప్ల విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తీవ్రంగా మండిపడ్డారు. దాదాపు 14 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు చెల్లించాల్సిన రూ. 5,000 కోట్ల ఫీజుల బకాయిలను ప్ర భుత్వం వెంటనే విడుదల చేయాలని డి మాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని తెలుగు సంక్షేమ భవ న్‌ను వేలాది మంది విద్యార్థులు ముట్టడించారు.

ఈ సందర్భంగా  కృష్ణయ్య మాట్లాడు తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం సమాజానికి మంచిది కాదన్నారు. ఈ పథకం  సమాజంలో గుణాత్మకమైన మార్పునకు నాంది పలికిందని అన్నారు. అయితే ఈ మార్పును ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం.. విద్యార్థులను చదు వు కు దూరం చేసేలా వ్యవహరిస్తోందన్నారు. 

ఫీజులు లేక అవస్థలు...

ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయన్నా రు. కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉద్యోగాలు వచ్చిన వారు అ ప్పు లు చేసి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పీజీ, విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి లక్షలాది మంది వి ద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్త నాటకానికి తెర లేపిన ప్రభుత్వం

ఈ సమస్యకు పరిష్కారం చూపకుండా, ప్రభుత్వం కొత్తగా ట్రస్ట్ బ్యాంక  ఏర్పాటు చేసి ఫీజులు చెల్లిస్తామని చెప్పడం ఒక నాటకమని కృష్ణయ్య విమర్శించారు. ఈ ప్రతి పాదనను తాము గట్టిగా వ్యతిరేకిస్తామని స్ప ష్టం చేశారు. విద్య అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, లక్షల కోట్ల అప్పులు తెస్తు న్న ప్రభుత్వం కేవలం రూ. 6,000 కోట్ల కో సం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.

గత 20 నెలలుగా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని, ఈ పథకం కోసం బడ్జెట్లో కేటాయించిన రూ. 5000 కోట్లు కూడా నిరుప యోగం చేసిందని ఆరోపించారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1500 కోట్లు విడుదల చేశారని, మన రాష్ట్రంలో మాత్రం విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు.

బీసీల ఓర్వలేనితనమే కారణం..

బీసీలు ఇంజినీరింగ్, ఇతర ఉన్నత విద్య కోర్సులు చదువుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నచ్చడం లేదని, అందుకే ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని కృష్ణయ్య ఆరోపించారు. మరోవైపు, కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తున్న ఆర్థిక శాఖ, పేద విద్యార్థుల బిల్లులను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.

గురుకులాలు, హాస్టళ్లు మంజూరు చేయాలి

రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ గురుకులాలు, 100 బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో సీట్లు దొరకక చాలా మంది విద్యార్థులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో నిద్రపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న గురుకుల పాఠశాలల్లో 20% అదనపు సీట్లు పెంచాలని, వసతి సౌకర్యాలు ఉన్నచోట అదనపు సెక్షన్లు ప్రారంభించాలని కోరారు. ఈ ముట్టడి కార్యక్రమంలో వేముల రామకృష్ణ, గుజ్జ కృష్ణ, రామకృష్ణ, నంద గోపాల్, ఎస్. రవికుమార్ యాదవ్, నిఖిల్ చందు, అరవింద తదితర విద్యార్థులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.