ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు
నేడు ఎల్బీనగర్‌లో విద్యార్థి వేదన దీక్ష
ఎల్బీనగర్, మే 10 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించి, పేద విద్యార్థులను ఆదుకోవాలని సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు సి.రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 7ను రద్దు చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను విడుదల చేయా లని డిమాండ్ చేశారు.
సోమవారం విద్యార్థి వేదన దీక్ష నిర్వహిస్తున్నట్లు సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పేద, మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేసే కుట్రలో భాగంగానే జీవో నెంబర్ 7 తెచ్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కేవీ గౌడ్, బోయిని రాఘవేందర్ ముదిరాజ్, బీవీ ముదిరాజ్, బాలస్వామి, రమేశ్, సర్దార్ శీను తదితరులు ఉన్నారు.






